AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

తాజా వార్తలు

Updated : 15/09/2021 14:45 IST

AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్‌) ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి గౌతమ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా  81 వేల మందికి రూ. 128 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ. 54 కోట్లు విద్యార్థులకు అందించామన్నారు. ‘‘కొన్ని రకాల ప్రత్యేక పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారు. ఆ సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది’’ అని గౌతమ్‌రెడ్డి చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని