దమ్మాలపాటి వ్యవహారంలో పిటిషన్‌ ఉపసంహరణ

తాజా వార్తలు

Updated : 22/07/2021 16:19 IST

దమ్మాలపాటి వ్యవహారంలో పిటిషన్‌ ఉపసంహరణ

దిల్లీ: అమరావతి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారనే కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏజీ హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసుపై స్టే ఇస్తూ హైకోర్టు గాగ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతేడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉందని.. దానిపై కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. 4 వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని