AP News: కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతుల ఆందోళన

తాజా వార్తలు

Updated : 08/10/2021 10:51 IST

AP News: కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతుల ఆందోళన

తుళ్లూరు గ్రామీణం: కృష్ణా నదీ తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. అమరావతి పరిధిలోని తాళ్లాయపాలెం సమీపంలో డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక డంపింగ్‌ చేసేందుకు జేసీబీలతో పనులు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న రైతులు, అమరావతి ఐకాస నేతలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. డ్రెడ్జింగ్‌తో కృష్ణా కరకట్ట దెబ్బతింటుందంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పనులు అడ్డుకునేందుకు ఐకాస నేతలు, రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఐకాస నాయకురాలు కంభంపాటి శిరీష సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని