సీఎం సార్‌.. మీ వయసు రహస్యం చెప్పరూ..?

తాజా వార్తలు

Updated : 21/09/2021 18:45 IST

సీఎం సార్‌.. మీ వయసు రహస్యం చెప్పరూ..?

ఎంకే స్టాలిన్, ఓ మహిళ మధ్య సరదా సంభాషణ

చెన్నై: 68 ఏళ్ల వయస్సులో హుషారుగా కనిపించే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఓ మహిళ నుంచి సరదా ప్రశ్న ఎదురైంది. అది విన్న వెంటనే స్టాలిన్ ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షమైంది. మంగళవారం ఉదయపు నడక వేళ కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అధికార డీఎంకే పార్టీ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. 

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్రాక్‌సూట్‌లో ఉదయం నడకకు వెళ్లారు. అటుగా వెళ్తోన్న ఓ మహిళ.. సీఎంను గుర్తించి, తన మనసులో దాగున్న ప్రశ్నను అడిగేశారు. ‘మీరు ఇప్పటికీ యువకుడిలా కనిపించడానికి గల రహస్యం ఏంటో చెప్తారా..?’ అంటూ అడిగేసి, పెద్దగా నవ్వేశారు. దానికి స్టాలిన్ కూడా చిరునవ్వులు చిందించారు. మితంగా ఆహారం తీసుకోవడమే అందుకు కారణమంటూ సమాధానమిచ్చారు. 

కొద్ది నెలల క్రితం తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి తమ ముఖ్యమంత్రి గురించి ఈ తరహా వీడియోలను చాలానే పోస్టు చేసింది. వాటిని చూస్తే స్టాలిన్‌కు ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధ తెలిసిపోతుంది. యోగా, సైక్లింగ్ అంటే కూడా ఆయన మక్కువ చూపుతారు. ‘ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ.. కొంత సమయం మనుమలు, మనుమరాళ్లతో గడుపుతాను. విశ్రాంతి తీసుకుంటాను. వేకువజామునే లేచి నడక, యోగా చేస్తాను. పది రోజుల్లో ఒక్కసారైనా సైక్లింగ్ చేస్తాను. పని భారం ఉన్నా వీటి వల్ల నేనేమీ అలసిపోను’ అంటూ ఓ సందర్భంలో స్టాలిన్ చెప్పుకొచ్చారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని