తెలంగాణలో విస్తారంగా వర్షాలు
close

తాజా వార్తలు

Updated : 09/07/2021 19:33 IST

తెలంగాణలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం  వ్యాపించడంతో రాగల రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదగా వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని