టీకా వేయించుకున్నా.. నా దగ్గర కొనరూ!

తాజా వార్తలు

Published : 17/07/2021 01:09 IST

టీకా వేయించుకున్నా.. నా దగ్గర కొనరూ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి అతలాకుతలం చేయని రంగమంటూ లేదు. ముఖ్యంగా చిరు వ్యాపారుల విక్రయాలపై తీవ్రంగా దెబ్బకొట్టింది. రోజుకో ఇంత అని సంపాదించేవారి పొట్ట కొట్టింది. ఇక్కడ కనిపించే వీధి వ్యాపారిదీ అదే పరిస్థితి. కరోనా భయంతో వినియోగదారులు రావడం తగ్గిపోవడంతో వినూత్న పంథాను ఎంచుకున్నాడు. తాను వ్యాక్సిన్‌ వేయించుకున్నా అని చూపుతూ స్టిక్కర్‌ వేయించుకున్నాడు. తన వద్ద కొనుగోలు చేస్తే వైరస్‌ భయం అక్కర్లేదని భరోసా ఇస్తున్నాడు. ఆ విధంగానైనా తన వద్దకు ఓ నలుగురు వినియోగదారులు రాకపోరా అన్న ఆశ ఈయనిది. మేఘాలయాలోని షిల్లాంగ్‌లో కనిపించిందీ దృశ్యం. ఇందిరా అనే మహిళ ఈ ఫొటోను ట్వీట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అద్భుతమైన ఆలోచన అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని