వంటపై హాస్యం అంటే మాటలా!

తాజా వార్తలు

Published : 25/07/2021 01:29 IST

వంటపై హాస్యం అంటే మాటలా!

భేల్‌పూరీ రెసిపీ గురించి ఎంపీ శశిథరూర్‌ ఏమని చెబుతారంటే..

దిల్లీ: కేరళ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఆంగ్ల పదజాలం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఉపయోగించే కొన్ని పదాలు ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారికే తప్ప సామాన్యులకు అర్థం కావు. ఇక ఆయన మాట్లాడుతుంటే... నిఘంటువు వెతుక్కోవాల్సిందే. తాజాగా ఇండియన్‌ స్ర్టీట్‌ఫుడ్‌ ‘భేల్‌పూరీ’ గురించి ఆయన చేసిన ఓ ట్వీట్‌ అర్థం చేసుకోవాలంటే అంతా ఇంతా సమయం పట్టదు మరి. ఈ వంటకానికి సంబంధించిన రెసిపీని సాధారణ రీతిలో కాకుండా... కాస్త ఇంగ్లీష్‌ని లోతుగా దట్టించి రెసిపీని రాసుకొచ్చారు. క్రిస్పీ రైస్‌ను వెస్ర్టన్‌ ఘాట్స్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ నుంచి,  మైక్రో గీన్స్‌ను నీల్‌గిరీ, సాస్‌ని స్వీట్‌ కేరళ బీచ్‌ నుంచి తీసుకొచ్చిన వాటితో అంటూ.. రాసుకొచ్చి చివర్లో వాటన్నింటిని కలిపితే తయారు అయ్యేదే  ‘భేల్‌పూరీ’ అని ముగించారు.  భేల్‌పూరీ వంటకం తెలిసిన వారు సైతం దీన్ని చదివితే అసలేంటిది అనే సందేహం వారి మదిలో మెదలక మానదు. కాగా ఈ రెసిపీ తన పేరుతో వాట్సప్‌లో వచ్చిందని, వీకెండ్‌లో మీరు ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండమని తనదైన స్టైల్‌లో సలహా ఇచ్చారు. ఇక నెటిజన్లు.. సర్‌.. పోహా ఎలా చేస్తారు? అమ్మాయిలేమో.. సర్‌ పానీపూరీ రెసిపి పెట్టడంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని