శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో రాములోరి కల్యాణం

తాజా వార్తలు

Published : 21/04/2021 20:28 IST

శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో రాములోరి కల్యాణం

వారణాశి: కాశీలోని రామభద్రేంద్ర సరస్వతి స్వామి స్థాపించిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ తక్కువ మంది భక్తులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరిగింది. ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వెంకట సుందర శాస్త్రి, ఉమ దంపతులు పీటల మీద కూర్చుని కల్యాణం జరిపించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఏటా నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుండగా.. కొవిడ్‌ నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే వేడుకలు నిర్వహించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సీవీబీ సుబ్రహ్మణ్యం, సోమయాజులు, పొంగలి కిషోర్ కుమార్, ఎ.ఎ. నరసయ్య, పురుషోత్తం, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని