AP: ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించండి’
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 16:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP: ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించండి’

సీఎం జగన్‌కు ఆర్టీసీ ఎన్‌ఎంయూ లేఖ

అమరావతి: ఏపీలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్న దృష్ట్యా వారి ప్రాణాలు కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ను ఆర్టీసీ ఎన్‌ఎంయూ కోరింది. ఈ మేరకు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ సీఎంకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి లేఖ రాశారు. ఇప్పటి వరకు 9,200 మంది ఆర్టీసీ కార్మికులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. సంస్థలో ఉన్న సుమారు 51,500 కార్మికుల్లో 18 శాతం మంది వైరస్‌ బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌తో ఇప్పటి వరకు 240 మంది కార్మికులు చనిపోయినట్లు తెలిపారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు 50 శాతం కార్మికులకు కూడా వ్యాక్సిన్‌ వేయలేదని.. దీనివల్ల ఎక్కువ మంది వైరస్‌ బారిన పడి మృతిచెందుతున్నారన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు వెంటనే వ్యాక్సిన్‌ వేయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించడం ద్వారా మరణాల నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని సీఎంను ఎన్‌ఎంయూ కోరింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన ప్రయోజనాలు అందించాలని.. గ్యాట్యుటీ, టెర్మినల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, పీఎఫ్ వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కారుణ్య నియామకాల ద్వారా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ సోకిన కార్మికులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని కోరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని