రోబో వంట.. అదిరెనంట..

తాజా వార్తలు

Published : 24/05/2021 01:58 IST

రోబో వంట.. అదిరెనంట..

వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబోల గురించి మనం విన్నాం.. చూశాం.. రోబో సినిమాలో చిట్టి వంటలు చేసినా.. అది కల్పితం. కానీ, స్పెయిన్ రోబో ఇంజినీర్లు ఆ కల్పితాన్ని కూడా నిజం చేశారు. వాళ్లు అభివృద్ధి చేసిన బీ ఏ రోబోట్ 5- BR నోరూరించే వంటలను ఇట్టే క్షణాల్లో వండి వారుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. రోబోల వినియోగం విస్తృతమవుతోంది. ఇప్పటికే రోబోలు పలు రంగాల్లో సేవలు అందిస్తోన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా స్పెయిన్‌ వాళ్లు వంటను చేసే రోబోలను కూడా సృష్టించేశారు. రోబో సినిమాలో చిట్టి వంటలు చేసినట్టే మ్యాడ్‌రిడ్‌లోని హోటల్‌లో ఆ రోబో కూడా క్షణాల్లో రుచికరమైన వంటలు చేసేస్తోంది. స్పెయిన్‌కు చెందిన బీఆర్‌-5 కంపెనీ ఈ రోబోను ఆవిష్కరించింది. ఈ రోబో స్పెయిన్‌ ప్రసిద్ధ వంటకాలను రుచికరంగా వండుతోంది. ఇంకేం ఈ రోబో వండిన రుచికరమైన ఆహార పదార్థాలను తిన్న మాస్టర్‌ చెఫ్‌లందరూ అద్భుతమని పొగిడేస్తున్నారు. ఇది వండి వార్చిన వంటలను లొట్టలేసుకొని తింటున్నారు.

ఒకేసారి 20 మందికి వంట చేస్తుంది..

రోబోట్‌లో ఎలక్ర్టానిక్‌ నియంత్రిత స్టవ్‌, యంత్రసాయంతో పనిచేసే చేయి కలిపి అభివృద్ధి చేసినట్టు బీఆర్‌-5 వ్యవస్థాపకుడు ఎన్రిక్‌లిల్లో తెలిపారు. జపాన్‌లో ఇప్పటికే ఈ రోబోలు వంటలు చేసేస్తున్నాయని తెలిపారు. ఇది ఒకేసారి గరిష్ఠంగా 20 మందికి వంట చేయగలదని ఆయన పేర్కొన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని