హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

తాజా వార్తలు

Updated : 27/06/2021 16:52 IST

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కోఠి, సుల్తాన్‌ బజార్‌, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, కింగ్‌ కోఠి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్‌, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. కూకట్‌పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, నాగోల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 

ఇవాళ, రేపు భారీ వర్షాలు..
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వర్షాల కురవచ్చని తెలిపారు. ఈరోజు ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ వరకు వ్యాపించి ఉందన్నారు. మరొక ఆవర్తనం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1కి.మీ వ్యాపించి ఉందని వివరించారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని