108 రాలేదు.. గర్భిణి ప్రాణాలు నిలవలేదు
close

తాజా వార్తలు

Published : 19/05/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

108 రాలేదు.. గర్భిణి ప్రాణాలు నిలవలేదు

జి మాడుగుల: విశాఖపట్నం ఏజెన్సీలో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. జి మాడుగుల మండలం అడ్డుల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు సోమవారం అర్ధరాత్రి పురుటి నొప్పులు వచ్చాయి. 108కి ఫోన్‌ చేసినప్పటికీ రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో గ్రామానికి వాహనం చేరుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందింది. స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త కూడా సకాలంలో స్పందించలేదని, వైద్యసేవలు అంది ఉంటే ఈశ్వరమ్మ బతికేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని