samosas: సమోసాలకు సీరియల్‌ నంబర్లు ఎప్పుడైనా చూశారా?

తాజా వార్తలు

Published : 04/09/2021 01:17 IST

samosas: సమోసాలకు సీరియల్‌ నంబర్లు ఎప్పుడైనా చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా సమోసాలకు ఎంతో క్రేజ్‌ ఉంది! గరం గరం సమోసాను చూస్తేనే చాలామంది లొట్టలేస్తుంటారు. మరి ఆ సమోసాలకు సీరియల్‌ నంబర్లు ఉంటే? ఏంటీ.. వాటికి సీరియల్‌ నంబర్లా.. అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఇది నిజమే. తాజాగా సమోసాలపై సీరియల్‌ నంబర్లు ముద్రించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ట్విటర్ యూజర్ నితిన్ మిశ్రా వాటిని తన ఖాతాలో షేర్‌ చేశారు. ‘నేను ఆర్డర్‌ చేసిన సమోసాలకు సీరియల్‌ నంబర్లు ఉన్నాయి’ అని వ్యాఖ్యను జతచేశారు. దీంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే 12వేలకు పైగా లైక్‌లతోపాటు రీట్వీట్‌లు వస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఒకింత విస్మయానికి గురవుతున్నారు! అంతేకాకుండా ఈ పోస్టుకు సరదా కామెంట్లూ చేస్తున్నారు. ‘ఇలాంటి పాత కాలపు సమోసాలను కొనడం మానేయండి. క్యూఆర్‌ కోడ్‌తో ఉన్నవాటినే కొనుగోలు చేయండి’ అని ఒకరు, ‘ఇక రసగుల్లాలపై క్యూఆర్‌ కోడ్‌ వేస్తారని భయంగా ఉంది’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్పండంటూ పలువురు ఆయనకు మెసేజ్‌లు చేసి అడుగుతున్నారు. దీనికి సమాధానంగా ‘వీటి గురించి మెసేజ్‌ చేయడం ఆపండి. ‘సమోసా పార్టీ’లో ఆర్డర్‌ చేసుకోండి’ అంటూ మరొక ట్వీట్‌ చేశారు. కాగా.. ‘సమోసా పార్టీ’ బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ. ఇందులో వెరైటీ సమోసాలను తయారు చేస్తుంటారు. బెంగళూరుతోపాటు గురుగ్రామ్‌లోనూ ఇవి లభిస్తాయి. అక్కడ సమోసాలపై వేర్వేరు సీరియల్‌ కోడ్‌లను స్టాంప్‌ చేస్తారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని