ఆర్టీసీ పయనమంటేనే అమ్మో..!

తాజా వార్తలు

Published : 14/09/2021 01:45 IST

ఆర్టీసీ పయనమంటేనే అమ్మో..!

అమరావతి: వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లు, కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో అధికమవుతోంది. క్షేమంగా గమ్యస్థానాలకు చేరతామో.. లేదో తెలియని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులది. ఇటీవల వరుస ప్రమాదాలు దీనికి ఉదాహరణలు. ఏటా 2 వేల కొత్త బస్సులు రావాల్సి ఉన్నా.. నిధులు రాక  పాత బస్సులకే మరమ్మతులు చేసి ఆర్టీసీ నడిపిస్తోంది. 

ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు చూశాక వాటిలో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లపై కాలం చెల్లిన బస్సుల్ని నడుపుతుండటం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారవడంతో ఆటోలు, ప్రైవేటు వాహనాలు నిలిపేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కండిషన్‌లో లేని ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. 

నిబంధనల ప్రకారం 10 లక్షలకు పైగా తిరిగిన బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆర్టీసీకి 9,039 సొంత బస్సులుండగా.. అందులో 10 లక్షల కిలోమీటర్లకు పైగా 4,588 బస్సులు తిరిగాయి. 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 2,800 బస్సులను సరకు రవాణాకు తరలించాల్సి ఉన్నా.. కొత్త బస్సులు లేకపోవడంతో పాత బస్సులకే రంగులేసి.. మరమ్మతులు చేసి సర్వీసులు నడిపిస్తున్నారు. ఏటా 2 వేల కొత్త బస్సుల కొనుగోలుకు రూ.300 కోట్ల వరకు కేటాయించే ప్రభుత్వం.. కొన్నేళ్లుగా దానిని నిలిపేసిందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని తీసుకురాకపోతే.. ఏదైనా అనర్థం జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని