ఊబకాయులకు మద్యంతో మరింత ముప్పు!

తాజా వార్తలు

Updated : 07/06/2021 01:14 IST

ఊబకాయులకు మద్యంతో మరింత ముప్పు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా మద్యం సేవించేవాళ్లు ఆ అలవాటును అంత సులువుగా మానుకోలేరు. తక్కువ మోతాదులో తాగే వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, విపరీతంగా మద్యం సేవించేవాళ్లలో కాలేయం దెబ్బతిని.. క్రమంగా ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. అయితే, మద్యం ప్రియుల్లో ఆరోగ్యంగా.. సన్నగా ఉండే వారికంటే ఊబకాయుల్లో కాలేయం తొందరగా దెబ్బతింటుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు యూరప్‌కు చెందిన క్లినికల్‌ న్యూట్రిషియన్‌ జర్నల్‌లో కథనం ప్రచురించారు. 

ఛార్లెస్‌ పర్కిన్స్‌ సెంటర్‌ అండ్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌, రీసెర్చ్‌ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ స్టామటాకిస్‌ ఈ అధ్యయనంపై వివరణ ఇస్తూ ‘‘ఆరోగ్యంగా, సన్నంగా ఉండే వ్యక్తులతో పోలిస్తే.. అధిక బరువు ఉన్నవాళ్లు, ఊబకాయులకు మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మితంగా మద్యం సేవించినా కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం 50శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది’’అని పేర్కొన్నారు. మద్యపానం విషయంలో యూకే అమలు చేస్తోన్న మార్గదర్శకాలను మించి మద్యం సేవించే ఊబకాయులపై అధ్యయనం చేయగా.. సాధారణ వ్యక్తుల కంటే కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 600శాతం అధికంగా, కాలేయ సంబంధిత వ్యాధులతో మరణాలు 700శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని