Passport: ఇకపై.. పోస్టాఫీస్‌ నుంచి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేయవచ్చు..

తాజా వార్తలు

Updated : 27/07/2021 05:55 IST

Passport: ఇకపై.. పోస్టాఫీస్‌ నుంచి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేయవచ్చు..

అందుకు ఏం చేయాలంటే...

విదేశాలకు వెళ్లాలంటే  పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. ఇదుంటే చాలు.. ప్రపంచంలోనే ఏ దేశానికైనా వెళ్లిరావొచ్చు. ఇన్నేళ్లు పాస్‌పోర్ట్‌ కావాలంటే పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల చుట్టూ బారులు తీరాల్సివచ్చేది. కానీ ఇప్పుడా సమస్య తప్పింది. మీ ఇంటి దగ్గరలోని తపాలా కార్యాలయం (పోస్ట్‌ ఆఫీస్‌)లోనే పాస్‌పోర్ట్‌ అప్లై చేసుకునే వెసులుబాటును ఇండియన్‌పోస్ట్‌ మీకు కల్పించనుంది. తాజాగా ఇదే విషయాన్ని ఇండియా పోస్ట్‌ ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

ఎలా అప్లై చేయాలంటే..

* passportindia.gov.in ప్రకారం.. పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌లో పాస్‌పోర్ట్‌ సర్వీస్‌ సెంటర్‌,  పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సర్వీస్‌ సెంటర్‌..  బ్రాంచీలుగా ఉన్నాయి. 

ఈ రెండు బ్రాంచీలు పాస్‌పోర్టు ఇచ్చేందుకు ఫ్రంట్‌ ఎండ్‌ సర్వీసులుగా పనిచేస్తాయి. అలాగే పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసేందుకు మనకు కావాల్సిన టోకెన్‌ను ఈ కేంద్రాల నుంచే పొందవచ్చు.

* ముందుగా పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్‌ అవ్వాలి.

* రిజిస్ట్రేషన్‌ పూర్తైన తర్వాత ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకోవాలి.  ఈ ప్రక్రియ పూర్తి కాగానే ధ్రువ పత్రాల పరిశీలనకు ఓ తేదీని మీకు కేటాయిస్తారు. ఆ తేదీన మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి.. మీ రశీదుతో ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
* ఒకసారి మీ డాక్యుమెంట్స్‌ కనుక ధ్రువీకరించినట్లైతే.. మీ పాస్‌పోర్ట్‌కి సంబంధించిన వివరాలు sms ద్వారా మీ మొబైల్‌ ఫొన్‌కే అందుతాయి.
కాగా ప్రక్రియంతా పూర్తవ్వడానికి 15 రోజులు పడుతుంది

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని