TS News: భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 15:12 IST

TS News: భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌

హైదరాబాద్‌: నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న సర్కారు భూములు అమ్మాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అమ్మకానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం... తాజాగా భూముల విక్రయానికి ప్రకటన జారీ చేసింది.

మొదటి దశలో కోకాపేట భూములతో పాటు ఖానామెట్‌ భూములను ప్రభుత్వం  విక్రయించనుంది. కోకాపేటలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన  నియోపోలిస్‌ లేఅవుట్‌లోని 7 ప్లాట్లతో పాటు గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌లోని ఒక ప్లాట్‌ ఉంది. 49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని ప్లాట్లు, ఖానామెట్‌లో టీఎస్‌ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. ఈనెల 15న నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా...25న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహిస్తారు. జులై 13 రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ కాగా, జులై 15న ఈ-వేలం నిర్వహిస్తారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్‌ఎండీఏ, ఖానామెట్‌ భూముల వేలం ప్రక్రియను టీఎస్‌ఐఐసీ నిర్వహించనుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని