మొదటి రోజు 82 రిజిస్ట్రేషన్లు: సీఎస్‌

తాజా వార్తలు

Published : 14/12/2020 23:55 IST

మొదటి రోజు 82 రిజిస్ట్రేషన్లు: సీఎస్‌

హైదరాబాద్‌: మూడు నెలల అనంతరం పూర్వపు కార్డ్‌ విధానంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మంగళవారానికి 58 కార్యాలయాల్లో 155 స్లాట్లు బుక్‌ అయ్యాయని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. స్లాట్ల విధానంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతోందని సీఎస్‌ పేర్కొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం ముందస్తుగా స్లాట్ల బుకింగ్‌ తప్పనిసరని,  స్లాట్‌లు బుక్‌ చేయకుండానే కొందరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్తున్నారని సీఎస్‌ తెలిపారు. ఎక్కడి నుంచైనా స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఇదీ చదవండి..
యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని