RUIA: ఘటనపై నివేదిక ఇవ్వండి:NHRC
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RUIA: ఘటనపై నివేదిక ఇవ్వండి:NHRC

దిల్లీ: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో రోగులు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఆక్సిజన్‌ ఆందకపోవడం వల్ల 11 మంది రోగులు మృతిచెందినట్లు జేస్తడి సుధాకర్‌ అనే వ్యక్తి.. 30 మంది చనిపోయారంటూ మాజీ ఎంపీ చింతా మోహన్‌ ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని