Raghurama: రఘురామ విడుదలకు సన్నాహాలు

తాజా వార్తలు

Updated : 24/05/2021 11:37 IST

Raghurama: రఘురామ విడుదలకు సన్నాహాలు

గుంటూరు: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన తరఫు న్యాయవాదులు ఇప్పటికే గుంటూరు జిల్లా కోర్టుకు చేరుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తును వారు సమర్పించనున్నారు. మెజిస్ట్రేట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ తర్వాత ఆదేశాలు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి చేరనున్నాయి. నేరుగా ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణరాజును అరెస్ట్‌ చేశారు. తొలుత గుంటూరు జైల్లో ఉన్న ఆయనను సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు వైద్యులతో కూడిన బృందం రఘురామను పరీక్షించింది. ఆ తర్వాత బెయిల్‌, వైద్యపరీక్షల నివేదికపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.  గతేడాది డిసెంబరులో పిటిషనర్‌కు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిందని.. ప్రస్తుత పరిస్థితులు, పిటిషనర్‌ విజ్ఞప్తిని పరిశీలించి బెయిల్‌ మంజూరు చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో రఘురామ విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఆయన తరఫు న్యాయవాదులు పూర్తిచేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని