Vaccine: సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌
close

తాజా వార్తలు

Published : 12/06/2021 21:17 IST

Vaccine: సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌

హైదరాబాద్: సింగరేణి సంస్థలో ఈ నెల 13 నుంచి మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్ వెల్లడించారు. సంస్థకు చెందిన 45 వేల మంది కార్మికుల్లో ఇప్పటికే 16 వేల మందికి మొదటి డోసు వాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 29 వేల మందికి 10 రోజుల్లోగా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామన్నారు. కార్మికులకు వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులో ఉండేలా సింగరేణి ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాల్స్‌లో వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డైరెక్టర్ల పర్యవేక్షణలో మెగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.. ఈ అవకాశాన్ని కార్మికులందరూ వినియోగించుకోవాలని సీఎండీ సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని