రిమోట్‌కారు ఆర్డర్‌ చేస్తే.. బిస్కెట్‌ పాకెట్‌!

తాజా వార్తలు

Published : 23/06/2021 20:28 IST

రిమోట్‌కారు ఆర్డర్‌ చేస్తే.. బిస్కెట్‌ పాకెట్‌!

నెట్టింట వైరల్‌ అయిన ఓ కస్టమర్‌ ఫన్నీ పోస్టు

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు ఆర్డర్‌ పెట్టడం ఇప్పుడో అలవాటుగా మారిపోయింది. తిండి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ.. నిత్యావసర సరకుల నుంచి మందుల వరకూ.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే చాలు.. నిమిషాలు, గంటలు, రోజుల వ్యవధిలో మన ముంగిటకే వచ్చేస్తున్నాయి. ఇంత సౌలభ్యాన్ని ఎవరు కాదంటారు చెప్పండి. అంతా బాగానే ఉంది. కానీ ఆర్డర్‌ పెట్టిన వస్తువు వస్తే సరేసరి.. దాని బదులు వేరేది వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు చాలామంది  సీరియస్‌ అవుతారు. వెంటనే సదరు యాజమాన్యంపై ఫిర్యాదులు చేస్తారు. అయితే ఇక్కడో కస్టమర్‌ మాత్రం విభిన్నంగా స్పందించి నెట్టింట వైరల్‌ అయ్యాడు. తనకు జరిగిన అనుభవాన్ని ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇలా సరదాగా రాసుకొచ్చాడు.. ‘‘అమెజాన్‌ ఇండియాలో రిమోట్‌ కంట్రోల్‌ కారు ఆర్డర్‌ పెట్టా. ఏమైందో ఏమోకానీ వారు నాకు పార్లే జీ బిస్కెట్‌ పంపారు. దీనిపై అమెజాన్‌ యాజమాన్యంపై నేను ఫిర్యాదు చేయదల్చుకోలేదు. బిస్కెట్‌ను ఛాయ్‌లో నంజుకొని తింటున్నా’’ అని ఆ విషయాన్ని ఎంత తేలికగా తీసుకున్నాడో వివరించాడు. ఈ పోస్టు కాస్త వైరల్ కావడంతో నెటిజన్ల ట్రోలింగ్‌ మొదలైంది. పోనీలే.. సాయంత్రం స్నాక్స్‌ దొరికిందని ఒకరంటే.. ఇంకా నయం ఇటుక రాలేదుగా అని మరొకరు సరదా కామెంట్లు పెట్టారు. అసలు ఈ విషయాన్ని అమెజాన్‌ దృష్టికి తీసుకెళ్లారా అని ఒక నెటిజన్‌ ఆత్రుతతో ప్రశ్నించగా.. వెంటనే ఆ కస్టమర్‌ స్పందించి.. కంపెనీ డబ్బును తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని