Trust Test: ప్రియురాలికి ప్రియుడి వింత పరీక్ష

తాజా వార్తలు

Published : 06/08/2021 15:35 IST

Trust Test: ప్రియురాలికి ప్రియుడి వింత పరీక్ష

మాస్కో: ప్రియురాలికి తనపై ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి ఆమెకు వింత పరీక్ష పెట్టాడు ఓ ప్రేమికుడు. ఆమెతో ఒక స్టంట్‌ను చేయించి.. చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏం చేశాడంటే..?

సెర్గీ కొసెంకో అనే రష్యా యువకుడు తన ప్రియురాలి నమ్మకాన్ని పరీక్షించాలనుకొని ఆమెతో ఒక వింత యాత్రను ప్లాన్‌ చేశాడు. ప్రియురాలిని కారు పైభాగంలో ఉంచి ఒక తాడుతో కట్టాడు. ఆమె నోటికి టేపు వేసి మాస్కో నగరం చుట్టూ ప్రయాణించాడు. ఆ సమయంలో తన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు. ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. అది చూసిన నెటిజన్లు దానిని తెగ షేర్‌ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ ఆ వీడియోను 14 లక్షల మంది వీక్షించారు. కొంత మంది షేర్‌ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా.. మరికొంత మంది ఇది ఒక ప్రమాదకరమైన దుశ్చర్యగా అభివర్ణించారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. అనంతరం విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో వాడిన లగ్జరీ కారు ఆ యువకుడిది కాదని.. దాన్ని కిరాయికి తీసుకున్నట్లు వారి ప్రాథమిక విచారణలో తెలిసింది. ట్రాఫిక్‌ ఉల్లంఘన కింద ఇప్పటికే ఆ కారుపై 68 చలానాలు ఉన్నట్లు తేలింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని