ఆ మూడు రాష్ట్రాల నుంచే 70 శాతం కొవిడ్‌ వ్యర్థాలు
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 16:40 IST

ఆ మూడు రాష్ట్రాల నుంచే 70 శాతం కొవిడ్‌ వ్యర్థాలు

బయో మెడికల్‌ వ్యర్థాలతో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్ల సంక్రమణ

 

దిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాక వ్యాధులు ఏ విధంగానైనా సంక్రమించవచ్చనే ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ఉదాహరణే బయోమెడికల్‌ వ్యర్థాలు. వీటి కారణంగా  23 రాష్ట్రాల్లో  కొవిడ్ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) చేసిన అధ్యయనంలో తేలింది. ఐఐపిఎస్‌ అధ్యయనాల ప్రకారం ‘‘సాధారణ బయోమెడికల్ వ్యర్థాలను పర్యవేక్షించడానికి 70 శాతం రాష్ట్రాల్లో సరైన వ్యవస్థలు లేవని వెల్లడి కాగా, నూతన నిబంధనల ప్రకారం 12 రాష్ట్రాలు మాత్రమే అప్‌గ్రేడ్ అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. దేశం మొత్తంలో మహారాష్ట్ర గుజరాత్‌, దిల్లీ నుంచే సుమారు 70శాతం కొవిడ్‌ వ్యర్థాల సేకరణ జరుగుతున్నట్లు సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ గణాంకాల్లో తేలింది. కాగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 54వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 1321 మంది వైరస్‌కు బలైనట్లు కేంద్రఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ 30.16 కోట్ల మందికి టీకా ఇచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని