తమిళనాడులో ఉత్సాహంగా జల్లికట్టు

తాజా వార్తలు

Published : 15/01/2021 03:55 IST

తమిళనాడులో ఉత్సాహంగా జల్లికట్టు

చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోళ్లు, ఎడ్ల పందేలు ఊపందుకున్నాయి. తమిళనాడులో ప్రతిఏటా నిర్వహించే జల్లికట్టు ఎంతో ప్రత్యేకం. సంక్రాంతి సందర్భంగా మదురాయ్​జిల్లాలోని అవనియపురంలో జల్లికట్టు పోటీలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. బసవన్నలను అదుపు చేసేందుకు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో దాదాపు 200 ఎద్దులు పాల్గొన్నాయి.

కరోనా నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో 150 మందికి మించి కీడాకారులు పాల్గొనకూడదని స్పష్టం చేసింది. కొవిడ్ నెగిటివ్​ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపింది. ప్రేక్షకుల సంఖ్య 50 శాతానికి మించకూడదని తెలిపింది. మరోవైపు సంక్రాంతి పండుగ తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వేదికగా మారింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇవాళ తమిళనాడులో పర్యటించారు. అవనియపురంలో నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ, ఉదయనిధి మారన్‌ హాజరై కోడె గిత్తలతో యువకులు ప్రదర్శించిన సాహస క్రీడను వీక్షించారు. 

ఇవీ చదవండి...
తొలిరోజు..3లక్షల మందికి టీకా..!

8నెలల్లో..చైనాలో తొలి కరోనా మరణం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని