AP NEWS: పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం

తాజా వార్తలు

Updated : 29/06/2021 20:21 IST

AP NEWS: పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు భేటీ అయింది. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం లభించింది. కడప జిల్లాలోని కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపొనెంట్స్‌కు అంగీకారం కుదిరింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు ఆమోదం లభించింది. చిత్తూరు జిల్లాలో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ ఏర్పాటుకు బోర్డు అంగీకారం తెలిపింది. నెల్లూరు జిల్లాలో జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. జిందాల్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు ఇవ్వనున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద భూమి ఇచ్చేందుకు ఆమోదం లభించింది. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా ఏర్పాటు చేయనుంది. 2.25 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. సెయింట్‌ గోబియాన్‌ సంస్థ ఏర్పాటుకు డెడ్‌లైన్‌ పొడిగింపునకు ఆమోదం లభించింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం వద్ద సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమ ఏర్పాటుకానుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కంపెనీల్లో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల వల్ల పర్యావరణపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని