Harsh Goenka: భర్తతో వేగలేకపోతున్నా.. ఆఫీసుకు పిలవండి!

తాజా వార్తలు

Published : 13/09/2021 01:23 IST

Harsh Goenka: భర్తతో వేగలేకపోతున్నా.. ఆఫీసుకు పిలవండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ విజృంభణ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని కల్పించాయి. కొంతమంది దీనికి బాగా అలవాటుపడిపోగా.. మరికొందరు ఎప్పుడెప్పుడు ఆఫీసులకు వెళ్లి పనిచేస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘నా భర్తను ఆఫీసుకు పిలవండి’ అని ఓ ఉద్యోగి భార్య చేసిన విజ్ఞప్తి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘సర్‌. నేను మీ ఉద్యోగి భార్యను. నా విజ్ఞప్తి ఏంటంటే.. నా భర్తను ఆఫీసు నుంచి పనిచేయడానికి అనుమతించండి. ఆయన రెండు డోసుల టీకా కూడా తీసుకున్నారు. అంతేకాకుండా, ఆఫీసులో కొవిడ్‌ నిబంధనలూ పాటిస్తారు. కానీ, మీరు ఇలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోం కొనసాగిస్తే మాత్రం మా దాంపత్య జీవితం కొనసాగదు! రోజుకు పది సార్లు కాఫీ తాగుతారు. గదులు మార్చుతూ పని చేస్తుంటారు. ఎప్పుడూ.. ఆహారం కావాలని అడుగుతారు. పనిచేసే సమయంలో ఆయన నిద్రపోవడాన్ని చాలాసార్లు గమనించాను. నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని చూసుకోవడానికే సమయం సరిపోవడం లేదు. నా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీ సాయాన్ని కోరుతున్నాను’ అని హర్ష గోయెంకాకు లేఖ రాశారు. దాన్ని ఆయన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఈ విజ్ఞప్తికి ఎలా స్పందించాలో తెలియట్లేదు’ అని రాసుకొచ్చారు.

 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని