Indian Air Force: అబ్బురపరిచే విమాన విన్యాసాల చిత్రాలు చూశారా?

తాజా వార్తలు

Updated : 04/10/2021 18:02 IST

Indian Air Force: అబ్బురపరిచే విమాన విన్యాసాల చిత్రాలు చూశారా?

89వ వార్షికోత్సవం సందర్భంగా రిహార్సల్స్‌లో తీసిన చిత్రాలివి

దిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) ఈనెల 8వ తేదీన (శుక్రవారం) 89వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్‌ ఫోర్స్‌ పెరేడ్‌ రిహార్సల్స్.. ఈ అబ్బురపరిచే విమాన విన్యాసాలకు వేదికైంది. ఇందుకు సంబంధించిన నాలుగు ఫొటోలను ఐఏఎఫ్‌ ట్విటర్‌లో పంచుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో శుక్రవారం ఘనంగా 89వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.00 గంటలకు AN-32 విమానం నుంచి  ఫ్లాగ్ బేరింగ్ స్కై డైవర్స్ డ్రాప్ అవుట్ అవ్వడంతో ప్రదర్శన ప్రారంభమవుతుంది. అనంతరం.. ఫ్లైపాస్ట్ లో హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఆధునిక ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తో ప్రదర్శన కొనసాగుతుంది. 

దిల్లీ, ఘజియాబాద్‌ ప్రజలకు ఇదే మా విన్నపం: భారతవాయుసేన
ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తమ వంతు సహకారాన్ని అందించాలని భారతవాయుసేన.. దిల్లీ, ఘజియాబాద్, పరిసర ప్రాంతాల ప్రజలను కోరింది. అదేంటంటే.. సాధారణంగా పక్షులు ఎగురుతున్నప్పుడల్లా విమానాలకు తీవ్రమైన ముప్పు ఉంటుంది. ముఖ్యంగా కిందిస్థాయిలో విమానాలు తిరుగుతున్నప్పుడు ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. బహిరంగంగా విసిరిన ఆహారాలు పక్షులను ఆకర్షిస్తాయి. తద్వారా పక్షులు ఎక్కువ తిరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని  దిల్లీ, ఘజియాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తినుబండారాలు కానీ, చెత్తచెదారాన్ని బహిరంగంగా వేయొద్దని భారత వైమానిక దళం కోరింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని