ఒకే వేదికపై మొహర్రం, వినాయక పూజలు

తాజా వార్తలు

Published : 28/08/2020 17:53 IST

ఒకే వేదికపై మొహర్రం, వినాయక పూజలు

హుబ్లీ: ఆలయాలు, మసీదులు పక్కపక్కనే ఉండటం చూసే ఉంటాం. కానీ కర్ణాటక రాష్ట్రం హుబ్లీ జిల్లా బిద్నాళ్‌ గ్రామంలో హిందువులు, ముస్లింలు ఒకడుగు ముందుకు వేసి ఒకేచోట చేరి పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. వినాయక చవితి, మొహర్రం సందర్భంగా గణేషుడు, పీర్లను ఒకే మండపంలో నెలకొల్పారు. మండపానికి వచ్చే హిందువులు వినాయకుడితో పాటు పక్కనే ఉన్న పీర్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముస్లింలు సైతం ప్రార్థనల అనంతరం గణేషుడికి పూజలు చేసి హారతి పడుతున్నారు. గ్రామంలో అన్ని పండుగలు కలిపి నిర్వహించుకునే బిద్నాళ్‌ వాసులు తమ పూర్వీకులు నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని