జీఎస్టీ ఆలస్య చెల్లింపుల నిబంధనల్లో మార్పులు

తాజా వార్తలు

Published : 27/08/2020 00:47 IST

జీఎస్టీ ఆలస్య చెల్లింపుల నిబంధనల్లో మార్పులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఆలస్యంగా చేసే చెల్లింపులకు సంబంధించి సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నికర బకాయిలపై వడ్డీ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ ఆలస్యపు చెల్లింపులపై 18శాతం వడ్డీ విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ఓ ప్రకటనలో తెలిపింది.

మార్చిలో జరిగిన 39వ జీఎస్టీ మండలి భేటీలో జీఎస్‌టీ స్థూల మొత్తంపై వడ్డీని 2017 జులై ఒకటి నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు చట్ట సవరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ ఆలస్యపు చెల్లింపులపై వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వడ్డీ విధించనున్నట్లు పేర్కొన్న కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు.. 39వ జీఎస్టీ మండలి భేటీలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా గతంలో ఆలస్యంగా చేసిన పన్ను చెల్లింపులకు సంబంధించి వడ్డీ రికవరీ ఉండదని వివరణ ఇచ్చింది. తాజా నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని