పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌..!

తాజా వార్తలు

Published : 02/06/2021 01:10 IST

పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌..!

గోవా ప్రభుత్వ వినూత్న నిర్ణయం

పనాజీ: ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. యువతీయువకులకు పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ అండ్‌ రూరల్ డెవెలప్‌మెంట్‌(జిపార్డ్‌) కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ఫార్మాట్‌ను త్వరలో ఖరారు చేస్తుందని న్యాయ శాఖ మంత్రి నీలేశ్‌ కబ్రాల్‌ పేర్కొన్నారు. ‘చాలా మంది నవదంపతులు పెళ్లైన ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే విడాకులు తీసుకుంటున్నారు. వారికి వైవాహిక జీవితం గురించి అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై పెళ్లికి ముందు కౌన్సెలింగ్‌(ప్రి-మారిటల్‌ కౌన్సెలింగ్‌)ను తప్పనిసరి చేయనున్నాం’ అని ఆయన తెలిపారు. అయితే, ప్రతి నెలా ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారనే విషయంలో స్పష్టత లేదని ఆయన పేర్కొనడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని