Covid: భద్రత భారమై.. ఆదాయం కరవై..!
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: భద్రత భారమై.. ఆదాయం కరవై..!

పోషకాహారం, వైరస్‌ నియంత్రణకు రూ.వేలల్లో ఖర్చు
మధ్యతరగతిపై మహమ్మారి ప్రభావం 

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: కరోనా మధ్యతరగతి జీవితాలను ఆగం చేస్తోంది. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టే మనుషులను పరీక్షిస్తోంది. భవిష్యత్తుపై ఆశలతో పొదుపు మంత్రం పాటించేవారిని భయాందోళనలో నెట్టేస్తోంది. కరోనా ప్రవేశం తర్వాత ఖర్చులు పెరగడమే తప్ప ఆదాయం లేదని దీనికి తోడు నిత్యావసర ధరలు రోకలిపోటుగా మారితే.. కరోనా రాకుండా భద్రత కోసం పెట్టే ఖర్చు భారంగా మారుతోందని వాపోతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం చుక్కలనంటుతున్నా.. ఆసుపత్రుల బిల్లులు చూసి భయపడటం కంటే నెలనెలా ఈ ఖర్చును భరించడమే మేలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో 30శాతం మంది బస్తీల్లో జీవనం సాగిస్తుంటే 50శాతం మందివి మధ్యతరగతి జీవితాలే. రెండేళ్లుగా ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు బడ్జెట్‌ దాటిపోతున్నాయని వాపోతున్నారు. 

రూ.5వేలు అదనపు భారం: కల్యాణ్, ఉప్పల్‌

ప్రయివేటు ఉద్యోగం. నెలకు రూ.25వేలు జీతం. మా కుటుంబ సభ్యులు ఆరుగురు. నెలవారీ అద్దె, ఇంటి ఖర్చులు పోను నెలకు రూ.5వేల వరకు ఆదా అయ్యేది. ఆసుపత్రుల బిల్లులు చూసి గొల్లుమనేకంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవడం మంచిదని అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాము. ఏప్రిల్‌ నెలలో ఇంట్లో ముగ్గురం కరోనా బారిన పడ్డాం. పోషకాహారం, మందులు, ల్యాబ్‌లో పరీక్షలు, పల్స్‌ ఆక్సీమీటర్‌ తదితరాలు కొనుగోలు చేశాము. సుమారు పదివేల వరకు ఖర్చు వచ్చింది. 15 రోజుల ఆదాయం పోవడమే కాకుండా అదనంగా ఖర్చులు మీద పడ్డాయి. 

పొదుపు లేని జీవితం: దుర్గంగౌడ్, చింతల్‌

ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాను. జీతం నెలకు రూ.35వేలు. నా భార్య, అమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్లాట్‌లో అద్దెకుంటున్నాను. నెలకు అద్దె, ఇతరత్రా కలిపి రూ.13వేలు. ఇంట్లో నెలవారీ సరకుల ఖర్చు రూ.5వేలు, మందులు,  పిల్లల ఫీజులు అదనం. పెట్రోల్, గ్యాస్, సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడాదిగా ఒక్క రూపాయి ఆదాయం పెరగలేదు. పండ్లు, మాస్కులు, శానిటైజర్‌ తదితరాల ఖర్చు అదనం. వైద్యం కోసం పెట్టే ఖర్చు కూడా పెరిగింది. దీంతో ఖర్చులు తప్ప పొదుపు లేని జీవితంగా మారిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని