కిడ్నాప్‌ కథ సుఖాంతం!

తాజా వార్తలు

Updated : 30/09/2020 09:01 IST

కిడ్నాప్‌ కథ సుఖాంతం!

భర్తతో కలిసి ఉండటానికే వెళ్లింది


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నారాయణ

వికారాబాద్‌ : వికారాబాద్‌ పట్టణంలో కలకలం రేపి పోలీసులను 48 గంటల పాటు ఉరుకులు, పరుగులు పెట్టించిన యువతి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతంగా ముగిసింది. భర్తతో కలిసి ఉండాలన్న ఇష్టంతోనే కారులో వెళ్లినట్లు అపహరణకు గురైన దీపిక తెలిపింది. మంగళవారం పోలీసు అధికారి ఎం.నారాయణ తన ఛాంబర్‌లో వారిద్దరినీ విలేకరుల ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక అపహరణకు గురైందన్న సమాచారంతో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె సిద్దిపేటకు వెళ్లిన విషయాన్ని వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ గుర్తించి తీసుకొచ్చారు. నాలుగేళ్ల కిందట ఖలీల్‌ అలియాస్‌ అఖిల్‌, దీపికలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దీపిక తల్లిదండ్రులకు ఇష్టంలేక విడాకుల కోసం న్యాయస్థానంలో కేసు దాఖలు చేయించగా కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉండాలన్న అభిప్రాయంతోనే కారులో భర్తతో వెళ్లానని పేర్కొందని పోలీసులు తెలిపారు. న్యాయస్థానంలో దీపిక చెప్పే వివరాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని