ఆసియాలో పలు చోట్ల భారీ భూకంపాలు

తాజా వార్తలు

Updated : 07/07/2020 07:11 IST

ఆసియాలో పలు చోట్ల భారీ భూకంపాలు

జకర్తా/సింగపూర్‌/దిల్లీ: ఆసియా ఖండంలోని పలు దేశాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని జావా ఐలాండ్‌లో బాటాంగ్‌ రీజియన్‌కు 100 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు సమాచారం. సింగపూర్‌లోనూ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఆగ్నేయ సింగపూర్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.1గా నమోదైంది. ఇక మన దేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనూ స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తవాంగ్‌ సమీపంలో భూప్రకపంనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.4గా ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని