ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టులో విచారణ

తాజా వార్తలు

Published : 03/07/2020 23:45 IST

ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టులో విచారణ

మార్గదర్శకాలు విడుదల చేయలేదన్న ప్రభుత్వం

హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల ఆన్‌లైన్‌ తరగతులపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. విద్యా సంవత్సరం మొదలుకాకముందే ఆన్‌లైన్‌ తరగతులు ఎలా అనుమతిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిని నిషేధించాలని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో మరోసారి విచారణ కొనసాగింది. కొంతమంది విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులను ఉపయోగించుకోగలుగుతున్నారని, ల్యాప్‌ట్యాప్‌లు కొనలేక, సాంకేతిక సమస్యలతో మరికొందరు తరగతులకు హాజరుకాలేకపోతున్నారని ఇది సరికాదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పరిస్థితిపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలంటూ గతంలోనే హైకోర్టు పేర్కొంది. 

కాగా దీనిపై ప్రభుత్వం తరఫున న్యాయవాది శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితులను తెలుసుకునేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించిన విషయాలను సబ్‌ కమిటీ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఎవరికీ చెప్పలేదని, ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని వెల్లడించింది. దీనిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్న పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ తరగతులపై ద్వంద్వ వైఖరి తగదని హెచ్చరించింది. గిరిజన ప్రాంతాలు, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈనెల 13 తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని