జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జి

తాజా వార్తలు

Updated : 01/07/2020 19:45 IST

జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జి

గుంటూరు: తెదేపా నాయకుడు అచ్చెన్నాయుడును జీజీహెచ్‌ నుంచి డిశ్ఛార్జి చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. అచ్చెన్నాయుడును విజయవాడలోని జిల్లా ‌జైలుకు తరలించారు. అయితే తనకు అన్ని పరీక్షలు చేశాకే డిశ్ఛార్జి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ కూడా రాశారు. ‘‘కొలనోస్కోపీ పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు. కొవిడ్‌ పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరు. కాబట్టి తనకు కరోనా పరీక్షలు చేయాలి’’ అని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు. కానీ వైద్యులు డిశ్ఛార్జి చేసేశారు. డిశ్ఛార్జి విషయం తెలిసి జీజీహెచ్‌ వద్దకు తెదేపా నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అచ్చెన్నాయుడు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని