అచ్చెన్నాయుడు రిమాండ్‌ పొడిగింపు

తాజా వార్తలు

Published : 27/06/2020 19:03 IST

అచ్చెన్నాయుడు రిమాండ్‌ పొడిగింపు

అమరావతి: ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు రిమాండ్‌ను అనిశా న్యాయస్థానం పొడిగించింది. వచ్చే నెల 10 వరకు అచ్చెన్నాయుడు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అనిశా కోర్టు గతంలో ఇచ్చిన 14 రోజుల రిమాండ్‌ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన విషయం తెలిసిందే. 

మరోవైపు అచ్చెన్నాయుడుపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) మూడు రోజుల విచారణ ముగిసింది. గుంటూరు జీజీహెచ్‌లో మూడు విడతలుగా అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు విచారించారు. ఈఎస్‌ఐ కేసుకు సంబంధించి వివిధ అంశాలపై అచ్చెన్నను ప్రశ్నించారు. మొత్తంగా మూడు రోజుల్లో 10.30 గంటలపాటు విచారించారు. ఇందులో తొలి రోజు మూడు గంటలు, రెండో రోజు ఐదు గంటలు, మూడో రోజు రెండున్నర గంటలు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి...
ESI: ముగిసిన అచ్చెన్నాయుడి విచారణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని