ముగిసిన అచ్చెన్నాయుడి రెండో రోజు విచారణ

తాజా వార్తలు

Updated : 26/06/2020 19:31 IST

ముగిసిన అచ్చెన్నాయుడి రెండో రోజు విచారణ

గుంటూరు: ఈఎస్‌ఐ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు విచారణ ముగిసింది. ఈ రోజు సుమారు ఐదు గంటలపాటు అధికారులు విచారణ జరిపారు. అనిశా కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు ప్రసాద్‌, చిరంజీవి నేతృత్వంలో విచారణ జరిగింది. అచ్చెన్నాయుడిని రేపు కూడా విచారించనున్నారు.

విచారణ ప్రారంభించటానికి ముందు అచ్చెయుడికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ తర్వాత ప్రత్యేక వార్డుకు తరలించిన అధికారులు అక్కడే విచారణ చేశారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు ఆయన తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. గురువారం అచ్చెన్నాయుడిని మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని