అచ్చెన్నాయుడు తొలి రోజు విచారణ పూర్తి

తాజా వార్తలు

Published : 25/06/2020 20:33 IST

అచ్చెన్నాయుడు తొలి రోజు విచారణ పూర్తి

గుంటూరు: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి తొలి రోజు విచారణ ముగిసింది. జీజీహెచ్‌లో అనిశా అధికారుల విచారణ చేపట్టారు. అనిశా డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో మూడు గంటలకుపై అచ్చెన్నాయుడిని అధికారులు ప్రశ్నించారు. మరో రెండు రోజులపాటు అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు విచారించనున్నారు. 14 రోజుల కస్టడీలో ఉన్న అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు విచారించడానికి కస్టడీలోకి తీసుకోవడానికి బుధవారం అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని