ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ

తాజా వార్తలు

Published : 04/06/2020 23:40 IST

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలకు పలువురు దాతలు, సంస్థలు తోడుగా నిలుస్తున్నాయి. ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని కొవ్వూరు నియోజకవర్గ సహకార సంఘాలు, నీటి సంఘాలు, అంగన్‌వాడీ మహిళలు, నాయకులు, అభిమానులు రూ. 1.10 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలిసి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తాడికొండ ఎమ్యెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి, నియోజకవర్గ నాయకులు, అభిమానులు సేకరించిన రూ. 25 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు.

తులసీ సీడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ రూ. 25 లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్‌ తులసీ రామచంద్ర ప్రభు సీఎం జగన్‌కు చెక్కు అందించారు. విశాఖపట్నం అల్లిపురంకి చెందిన కల్వరి బాప్టిస్ట్‌ చర్చి రూ. 10 లక్షలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన ఆంధ్రా విశ్వవిద్యాలయం అనుబంధ బీఈడీ కళాశాలలు రూ. 3.65 లక్షలు, ఏపీ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ (విజయనగరం) రూ. 1,00,000, ఎన్బీఎం లా కళాశాల(విశాఖ) రూ. 25,000, విశాఖలోని రుషికొండ వుడా హరిత టౌన్‌షిప్‌ రెసిడెంట్స్‌, ఫ్లాట్‌ ఒనర్స్‌ రూ.లక్ష విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును వైకాపా నేత విజయసాయిరెడ్డి సీఎం జగన్‌కు అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని