ఎన్‌ఆర్‌ఐకి ‘పెళ్లి వల’

తాజా వార్తలు

Updated : 29/05/2020 08:28 IST

ఎన్‌ఆర్‌ఐకి ‘పెళ్లి వల’

రూ.65 లక్షలు దండుకున్న తల్లి, కుమారుడి అరెస్ట్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: విలాసాలకు అలవాటు పడి.. 22 ఏళ్ల కుమారుడున్న ఓ మహిళ విషయం దాచి పెళ్లికి సిద్ధమంటూ ఎన్‌ఆర్‌ఐకి టోపీ పెట్టింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య కథనం ప్రకారం కాలిఫోర్నియాలో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వరుణ్‌ పెళ్లి సంబంధం కోసం ఓ మాట్రిమొనిలో దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిళ ప్రాంతానికి చెందిన దేవతి శ్రీనివాస్‌, ఆయన భార్య మాళవిక అలియాస్‌ కీర్తి మాధవనేని(44), కుమారుడు ప్రణవ్‌(22), శ్రీనివాస్‌ తల్లి గజలక్ష్మి విలాసాలకు అలవాటు పడ్డారు. తేలికగా డబ్బు సంపాదించాలని పెళ్లి సంబంధాలు వెతికే ఎన్‌ఆర్‌ఐని మోసం చేయాలని పథకం వేశారు. అదే వివాహ వేదికలో తన పేరును కీర్తిగా పేర్కొంటూ.. ఈ ఏడాది జనవరిలో వరుణ్‌తో పరిచయం ఏర్పరుచుకుంది. కాస్త దగ్గరయ్యాక ఓ కట్టుకథ వినిపించింది. తన తండ్రి చనిపోయారని ఆస్తి విషయంలో తల్లితో ఇబ్బందులు ఉన్నాయంటూ వరుణ్‌ను నమ్మించింది. తాను ఒక్కతే కుమార్తెనని, కోట్ల రూపాయల ఆస్తులను తన పేరు మీదికి మార్చుకోవాలంటూ నమ్మించి విడతలుగా రూ.65లక్షలు తన ఖాతాలో వేయించుకొంది. అనుమానం వచ్చిన టెకీ ఆరా తీశాడు. మోసపోయానని గ్రహించి మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుక్రవారం నిందితురాలిని, ఆమె కుమారుడిని అరెస్ట్‌ చేశారు. ఆమె భర్త, అత్త పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. వీరి కుటుంబంపై గతంలో నల్లకుంట, మారేడ్‌పల్లి స్టేషన్లన్లు, సైబర్‌క్రైంలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. దర్యాప్తులో వారు దాదాపు 300 ఆవులతో గోశాల నిర్వహిస్తున్నట్లు తెలపడంతో ఆరా తీస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని