ప్రేమ పేరుతో నమ్మించి మోసం

తాజా వార్తలు

Updated : 24/05/2020 09:01 IST

ప్రేమ పేరుతో నమ్మించి మోసం

ఒంగోలు నేరవిభాగం: ప్రేమ పేరుతో ఓ బాలికను వంచించి, అసభ్య వీడియోలు చిత్రీకరించి.. బెదిరించిన ఓ యువకుడి దారుణమిది.  ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శనివారం వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన యువకుడు రామయ్య తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామంలో బేల్దార్‌ పనులకు వెళ్లాడు. అక్కడి ఓ బాలికను ప్రేమ పేరుతో  నమ్మించి తన ఇంటికి తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. 20 రోజులపాటు వేధించాడు. వీడియోలు చిత్రీకరించి తన మిత్రులతో సన్నిహితంగా మెలగాలని బెదిరించాడు. తర్వాత రామయ్య స్నేహితులూ బాలికపై అత్యాచారం చేశారు. వేధింపులకు భయపడి బాలిక అతని వద్ద నుంచి తప్పించుకొంది. ఒంగోలుకు చేరుకుంది. అక్కడ ఆమెను క్వారంటైన్‌కు పంపారు. అధికారులు వివరాలు అడగడంతో విషయం బయటపడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని