కరోనా: అశ్వగంధతో  క్లినికల్‌ ట్రయల్స్‌

తాజా వార్తలు

Published : 07/05/2020 20:22 IST

కరోనా: అశ్వగంధతో  క్లినికల్‌ ట్రయల్స్‌

ఆయుష్‌, వైద్య, ఐసీఎంఆర్‌, సీఎస్‌ఐఆర్‌ ఉమ్మడి పరీక్షలు

దిల్లీ: ఆయుర్వేద మూలిక అశ్వగంధపై ప్రభుత్వం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది. హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పోలిస్తే కొవిడ్‌-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో ఎంత సమర్థంగా పనిచేయనుందో తెలుసుకోనుంది. సీఎస్‌ఐఆర్‌ సాంకేతిక సిబ్బంది, ఐసీఎంఆర్‌ సహాయంతో ఆయుష్‌, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ ట్రయల్స్‌ చేపట్టనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

స్వల్ప, మరికాస్త ఎక్కువ లక్షణాలున్న కొవిడ్‌-19 రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి+పిప్పలి, పాలీ హెర్బల్‌ ఫార్మలేషన్‌ (ఆయుష్‌-64)ను ఇస్తారని ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేశ్‌ కొటెచా తెలిపారు. ఆయుష్‌-64ను మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. ‘ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా, వస్తే నియంత్రించేందుకు ఆయుర్వేద ఔషధాల ప్రయోజనాలను నిర్ధారించేందుకు ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ఉపయోగపడతాయి’ అని కొటెచా వెల్లడించారు.

కొవిడ్‌-19 నియంత్రణకు ఆయుష్‌ సలహాలను స్వీకరించాలనుకునే వారి అంగీకారం కోసం ‘సంజీవని’ మొబైల్‌ యాప్‌ను మంత్రి హర్షవర్దన్‌ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయుష్‌ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 లక్షల మందిని చేరుకొనేలా ఈ యాప్‌ను రూపొందించారు. కొవిడ్‌-19 అంతమయ్యాకా ఆయుష్‌ ప్రయోజనాలు కొనసాగేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని హర్షవర్దన్‌ అన్నారు. ఇతర చికిత్సా పద్ధతులకు ఆయుష్‌ మద్దతుగా నిలిచి బలం పెంచుతుందని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని