మా మంచి మాస్టారు!

తాజా వార్తలు

Published : 28/04/2020 00:40 IST

మా మంచి మాస్టారు!

తల్లి సలహాతో విద్యార్థుల ఫీజులు రద్దు

వారణాసి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కరవై చాలామంది తమ పిల్లల స్కూలు ఫీజులూ చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ఫీజులు మాఫీ చేసి మంచి మనస్సు చాటుకున్నారు. వారణాసిలోని పుష్ఫ సిటీ ప్రైడ్‌ స్కూల్‌లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫీజుల చెల్లింపు విషయమై తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రిన్సిపాల్‌ వాచస్పతి శ్రీవాస్తవ.. ఏం చేయాలో సలహా ఇవ్వాల్సిందిగా తన తల్లిని అడిగారు.  స్పందించిన ఆమె.. ‘ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతోంది. ఈ సమయంలో వారిని ఆదుకునేందుకు నీవు చేయగలిగిన సేవ చేయి . విద్యార్థులను మనం కుటుంబ సభ్యుల్లాగే భావిస్తాం కదా! వారి బాధలను అర్థం చేసుకో. ఈ సంక్షోభం ముగిశాకా డబ్బులు ఎలాగో వస్తాయి’ అని సూచించారు. దీంతో ఆయన విద్యార్థులకు సంబంధించిన ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల ఫీజులు మాఫీ చేశారు. మరోవైపు ఇటీవల న్యూదిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కూడా ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావద్దని కోరాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని