మనవరాలితో టేబుల్‌ టెన్నిస్‌ ఆడిన మంత్రి 

తాజా వార్తలు

Updated : 25/04/2020 18:45 IST

మనవరాలితో టేబుల్‌ టెన్నిస్‌ ఆడిన మంత్రి 

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు, సినీతారలు, నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. వాళ్లకు ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు లాక్‌డౌన్‌ సమయంలో సరదాగా మనవరాలితో ఆడుకున్నారు.
 హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మనవరాలు తన్వితో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు. ఇందకు సంబంధించిన చిత్రాలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటిస్తూ ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని