ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

తాజా వార్తలు

Updated : 25/04/2020 09:26 IST

ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

 న్యూయార్క్‌లో కేసుల తీరు..
 నమూనా ‘యాంటీబాడీ పరీక్షల’ ఆధారంగా గుర్తింపు

న్యూయార్క్‌(అమెరికా) నగర జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్రం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్‌ రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ మార్కెట్లు, బిగ్‌ బాక్స్‌ స్టోర్ల బయట నిర్వహించిన 3 వేల యాంటీబాడీ పరీక్షల ఆధారంగా ఈ లెక్క కట్టారు. ‘‘న్యూయార్క్‌ నగరంలో 21% మంది (దాదాపుగా 20 లక్షల మంది)లో, రాష్ట్రవ్యాప్తంగా 13.9% మందిలో వైరస్‌ యాంటీబాడీలు ఉన్నాయి. అంటే 3 నుంచి 6 వారాల క్రితమే వారు వైరస్‌ బారిన పడి కోలుకున్నారు’’ అని రాష్ట్ర గవర్నర్‌ కుమోవ్‌ గురువారం వెల్లడించారు. ఈ లెక్కలను మొత్తం జనాభాతో పోల్చలేమని, పూర్తిస్థాయిలో బాధితుల సంఖ్యని ఈ అధ్యయనం వెల్లడించలేదని చెప్పారు. ‘‘వీరంతా షాపింగ్‌కు వచ్చినవారు. ఇళ్లలో ఉన్నవారు, క్వారంటైన్‌లో, ఐసోలేషన్‌లో ఉన్నవారు, వైద్యులు, ఆరోగ్య సేవకులు, విధుల్లో ఉన్నవారు ఈ సర్వేలో భాగం కాలేదు’’ అని కుమోవ్‌ పేర్కొన్నారు.బాధితుల్లో తెల్లవారి కంటే నల్ల జాతీయులు, లాటిన్‌ అమెరికన్లు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని