కరోనాపై పోరుకు ‘వరుణ్ గ్రూప్‌‌’ రూ.2కోట్లు

తాజా వార్తలు

Published : 09/04/2020 20:49 IST

కరోనాపై పోరుకు ‘వరుణ్ గ్రూప్‌‌’ రూ.2కోట్లు

అమరావతి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలు సంస్థలు, వ్యక్తులు తమవంతు తోడ్పాటునందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల కోసం విరాళాలు అందిస్తున్నారు. గురువారం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. వరుణ్‌ గ్రూప్‌ రూ.2 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు వరుణ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రభుకిషోర్‌, వరుణ్‌దేవ్‌ సీఎం జగన్‌ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. అలాగే, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో వెంకట్‌ జాస్తి చెక్కును సీఎంకు అందజేశారు.

నరసారావుపేటకు చెందిన వైద్యులు, వ్యాపారవేత్తలు కలిపి రూ.కోటి విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి సీఎంకు అందజేశారు. విజయవాడ రోమన్‌ కేథలిక్‌ డయోసిస్‌, గుంటూరు రోమన్‌ కేథలిక్‌ డయోసిస్‌, దొడ్ల డెయిరీ చెరో రూ.25 లక్షల చొప్పున విరాళం అందజేశాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని