కరోనాపై పోరుకు విరాళాల వెల్లువ

తాజా వార్తలు

Published : 01/04/2020 18:55 IST

కరోనాపై పోరుకు విరాళాల వెల్లువ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా దాతలు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో సీఎం సహాయనిధికి రూ. 7.50 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ని కలిసిన సంస్థ ప్రతినిధులు చెక్కు అందజేశారు. మరో రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లు, రూ.కోటి విలువైన మందులు కూడా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. గ్లాండ్‌ ఫార్మా ఎండీ శ్రీనివాస్‌ కూడా సీఎం కేసీఆర్‌ని కలిసి రూ. కోటి విరాళం చెక్కును అందించారు. నవభారత్‌ వెంచర్స్‌ రూ. 2.5 కోట్లు, మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ రూ. 50 లక్షలు విరాళంగా అందించాయి. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డా.నాగేశ్వర్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ని కలిసి రూ. 50 లక్షల చెక్కు అందించారు. మధ్యాహ్న భోజనం వండే కార్మికుల కోసం రూ. 2.65 కోట్లను విరాళంగా అందజేయనున్నట్లు కాన్సెంట్‌ లెటర్‌ను కార్మిక సంఘం అధ్యుక్షుడు సీఎం కేసీఆర్‌కు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని