కన్నా ఇంటికొచ్చేశా, కానీ... 

తాజా వార్తలు

Published : 02/04/2020 01:39 IST

కన్నా ఇంటికొచ్చేశా, కానీ... 

కన్నీరు పెట్టిన వైద్యుడు... వైరల్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్:  కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) బారిన పడకుండా ఉండటానికి ప్రజలందరూ తమతమ ఇళ్లలోఉంటే... వైద్య సిబ్బంది మాత్రం  బాధితులను కాపాడటానికి శ్రమిస్తున్నారు. ఈ నిరంతర యుద్ధంలో ఆకలి దప్పులను, అలసటను  వారు పట్టించుకోవటం లేదు.  తమకు ప్రియమైన వారిని చూడలేకపోవటం, దూరంగానే ఉండవలసి రావటం వారికి బాధాకరంగా ఉంది. అయితే ఒక వైద్యుడు తన విధులను ముగించుకొని ఇంటికి వచ్చి తన కోసం వచ్చిన కుమారుడిని ముద్దాడలేక దూరంగా ఉండిపోతాడు. ఆరు సెకన్ల పాటు సాగే ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్ల గుండెల్లో ఆర్ధ్రత పుట్టిస్తోంది. 

సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడిని గురించిన ఈ వీడియోలో...  ఒక చిన్న బాబు తన తండ్రి ఇంటికి రావటాన్ని గమనించి పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వస్తాడు. తండ్రి తనను ఎత్తుకుని ముద్దాడతాడని భావించిన ఆ చిన్నారి... తనను దూరాన్నే ఆపేయటంతో చిన్నపోతాడు. తన ముద్దుల కొడుకును దగ్గరకు తీసుకోలేని పరిస్థితిని భరించలేక ఆ తండ్రి కన్నీళ్లపర్యంతమవుతాడు. ఈ వీడియోను ఇప్పటికే వేలాదిమంది చూశారు. ఇది చాలా బాధాకరమైనప్పటికీ... ఆ డాక్టర్‌ రియల్‌ హీరో అని ఆ బాబుకు తండ్రి గారాబం దక్కాలని పలువురు కోరుకుంటున్నారు. ఇన్ని త్యాగాలు చేస్తున్న వారి కుటుంబాలకు అంతా మంచి జరగాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని