దిక్కుతోచని స్థితిలో రైతులు: పవన్‌

తాజా వార్తలు

Published : 31/03/2020 12:26 IST

దిక్కుతోచని స్థితిలో రైతులు: పవన్‌

అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా భవన నిర్మాణ కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో 21లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, మరో 30లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు నిధులు విడుదల చేసేలా లేఖలు రాశారని ఈ సందర్భంగా పవన్‌ గుర్తు చేశారు. 

లాక్‌డౌన్‌ కారణంగా రోజు వారీ కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ముఖ్యంగా అరటి రైతులు పంటను కోల్పోయే ప్రమాదముందన్నారు. ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వీరందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పవన్‌ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని